Heavy Rains: భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం

Heavy Rains: భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది.

Update: 2024-07-20 04:54 GMT

Heavy Rains: భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం

Heavy Rains: భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉదయం 8 గంటలకు భద్రాచలం దగ్గర 31.5 అడుగులకి నీటిమట్టం చేరుకుంది. ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రామాలయం స్నానాల ఘాట్ నీటి మునిగింది. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

Tags:    

Similar News