తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Telangana: హైదరాబాద్ సిటీలో రాత్రి నుంచి భారీ వర్షం

Update: 2022-06-21 01:26 GMT

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Telangana: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్, వరంగల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, సంగరెడ్డి, పటాన్ చెరు, సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్ , మేడ్చల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వివిద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌ నగరంలో సోమవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్‌, రాయదుర్గం, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, లింగంపల్లి, అత్తాపూర్‌, గుడిమల్కాపూర్‌, మెహిదీపట్నం, షేక్ పేట, ఆసిఫ్ నగర్, బోయిన్ పల్లి, అల్వాల్, మారేడు పల్లి తిరుమలగిరి, బేగంపేట, ప్యారడైజ్ తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది.

హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి నుంచి పడుతున్న భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు అధికార యంత్రంగం అప్రమత్తం అయ్యింది. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-21111111ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వర్ష ప్రభావిత ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఏవైనా ఉంటే తెలియచేయాలని సూచించారు.

ఈ నెల 24 వరకుతేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీ్‌స్ గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

మాదాపూర్‌లో అత్యధికంగా 6.73 సెం.మీ. వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో 5.93, బాలానగర్‌లో 5.3, మూసాపేటలో 4.95, షాపూర్‌నగర్‌లో 4.78, ఆర్‌సీ పురంలో 4.55, మచ్చబొల్లారంలో 4.53, చందానగర్‌లో 4.33. బోరబండలో 4.05, షేక్‌పేటలో 3.63, తిరుమలగిరిలో 3.45, ఖైరతాబాద్‌లో 3.43, అల్వాల్‌లో 3.40, హెచ్‌సీయూలో 3.33, జూబ్లీహిల్స్‌లో 3.20, గచ్చిబౌలిలో 3.18, అల్వాల్‌లో 3.05, అమీర్‌పేటలో 2.90, యూస్‌ఫగూడలో 2.53 సెం.మీ. వర్షపాతం నమోదైంది,

Tags:    

Similar News