Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Weather Report: ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో పలు వర్షం పడింది. హైదరాబాద్ లో మాత్రం దండికొట్టింది. మరి సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది. ఎక్కడెక్కడ వర్షాలు పడుతాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-07-15 02:36 GMT

Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Weather Report:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అంచనాలకు తగినట్లుగా వర్షాలు పడుతున్నాయి. అటు రైతులకు కావాల్సిన వర్షం నీరు అందుతోంది. భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇంకా చాలా వర్షాలు పడాల్సి ఉంది. ఇప్పటికే అనుకున్నంత స్థాయిలో వర్షం కురవడం లేదు. భారత వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం..ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

నేడు తెలంగాణపై భారీగా మేఘాటు కమ్ముకున్నాయి. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మంగళవారం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర, యానాంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు శాటిలైట్ అంచనాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణపై నేడు ఉదయం నుంచే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోనూ వర్షం పడనుంది. మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం రాత్రి 12గంటల వరకు కూడా కురుస్తూనే ఉంటుంది. అయితే రాత్రి 10గంటల తర్వాత ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రలో మాత్రమే కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

గాలి వేగం చూస్తుంటే బంగాళాఖాతంలో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్లుగా ఉన్నా..ఆ గాలి ఏపీలోకి రావడం లేదు. అరేబియా నుంచి ఏపీ, తెలంగాణకు గాలీ వీస్తూంది. తెలంగాణలో గాలి వేగం గంగు 10 నుంచి 15కిలోమీటర్లు ఉండగా..ఏపీలో గంటకు 12 నుంచి 19 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రత నేడు బాగా తక్కువగా ఉంటుంది. ఏపీలో సాధారణంగా యావరేజ్ టెంపరేచర్ 28 డిగ్రీల సెల్సీయస్ ఉంటుంది. తెలంగాణలో 28డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్య రాయలసీమలో కొంత వేడి ఉంటుంది. కానీ మేఘాలు మాత్రం రోజంతా రెండు రాష్ట్రాల్లో ఉంటాయి.

కాగా నేటి నుంచి 5 రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Tags:    

Similar News