కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రికార్డు స్థాయిలో వరద
Kaleshwaram Project: నీట మునిగిన పుష్కరఘాట్, చిరుదుకాణాలు
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. పుష్కర ఘాట్, చిరుదుకాణాలు నీట మునగగా.. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు 85 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. 70కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్ళాయి. లక్ష్మీ బ్యారేజీ ఇన్ ఫ్లో 28లక్షల 67వేల 650 క్యూసెక్కులుగా ఉంది. అదేవిధంగా సరస్వతీ బ్యారేజిలోకి కూడా భారీ వరద చేరుతుంది. ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, మంగపేట మండలాల్లో వరద ముంచెత్తుతుంది.