టీఆర్‌ఎస్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

High Court: మునుగోడు ఉపఎన్నికలో గుర్తులపై టీఆర్‌ఎస్ పిటిషన్

Update: 2022-10-18 03:37 GMT

టీఆర్‌ఎస్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

High Court: టీఆర్ఎస్‌ హైకోర్టులో వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఇవాళ సీజే ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మునుగోడు ఎన్నికలో తమ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్‌ను స్వతంత్రులకు కేటాయించ వద్దని... ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కొద్ది రోజుల క్రితం కారును గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కోరుతూ టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. సీఈసీ నుంచి స్పందన రాకపోవడంతో టీఆర్ఎస్‌ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక గుర్తును పోలిన గుర్తును బ్యాలెట్ పేపరులో లేకుండా చేయకపోవడం చట్ట వ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే టీఆర్ఎస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 3న ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. దీంతో ఇవాళ కేసు విచారిస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వెల్లడించారు.

Full View
Tags:    

Similar News