ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

* నిందితుల విజ్ఞప్తిపై విచారణ జరపనున్న సుప్రీం కోర్టు

Update: 2022-11-14 03:41 GMT

ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Moinabad Farmhouse Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు రిమాండ్ విధించడంపై నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ వేసిన పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. గతంలో జరిగిన వాదనల్లో నిందితుల తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో చేసిందని సీబీఐ దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని వాదించారు. నిందితుల బెయిల్‌ పిటిషన్‌లు హైకోర్టులో ఉన్నాయని తెలంగాణ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

Tags:    

Similar News