తెలంగాణలో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వెనుకాడుతున్న హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్లు

*తెలంగాణలో తగ్గుముఖం పట్టిన వ్యాక్సినేషన్ *వ్యాక్సినేషన్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Update: 2021-01-25 02:00 GMT

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వెయ్యి సెంటర్లను ఏర్పాటు చేసింది. ఒక్కో సెంటర్‌లో 100 మందికి టీకా వేసేలా వెసలు బాటు కల్పించారు. కానీ వ్యాక్సిన్‌ వేసుకోవడానికి హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్లు వెనుకాడుతున్నారు. వ్యాక్సిన్ వద్దంటే వద్దు అంటున్నారు. దీంతో ప్రభుత్వం టార్గెట్ రీచ్‌ కావడం లేదు. ఎలాగైన వ్యాక్సిన్‌పై భరోసా కల్పించాలని వైద్యశాఖ సంకల్పించింది. అందుకోసం కసరత్తులు ప్రారంభించింది.

తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్రం సూచనల మేరకు ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌కి వ్యాక్సిన్ వేస్తున్నారు. మొదటి విడతలో 3 లక్షలకు పైగా టీకాలు రాష్ట్రానికి వచ్చాయి. రెండో విడతలో 2 లక్షలకు పైగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొందరు వ్యాక్సిన్ వేసుకోడానికి ధైర్యం చేయడం లేదని వైద్యులు భావిస్తున్నారు. హెల్త్ వర్కర్లు మాత్రం వ్యాక్సిన్ వేసుకున్నారని క్లినికల్ ఎథిక్స్ ఛైర్మన్ విజయ్ భాస్కర్ అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందికి వ్యాక్సిన్ వేశారని ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అంటున్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ముందే ఎన్నో ప్రయోగాలు చేశారని క్లినికల్‌ ఎథిక్స్‌ చైర్మన్ విజయ్‌భాస్కర్ గుర్తుచేశారు. ముఖ‌్యంగా క్లినికల్ ట్రాయల్స్ 3 దశలు పూర్తి చేసిన తర్వాతే అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు.

వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వైద్యులే ముందుకు రాకపోవడంతో సామాన్యులు సైతం వెనక్కి తగ్గే ప్రమాదముంది. ఇప్పటికైనా వైద్యులు, వైద్య సిబ్బంది అపోహాలు వీడి వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News