Harish Rao: హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి

Harish Rao: దసరాకు ఊళ్లకు వస్తున్న యువతతో చర్చించండి

Update: 2024-10-07 01:46 GMT

Harish Rao: హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి

Harish Rao: గతేడాది దసరాకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ఓటేసిన యువత ఆలోచించాలని ఎక్స్ వేదికగా కోరారు మాజీమంత్రి హరీష్ రావు. గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదంటూ విమర్శించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని.... పది నెలలు గడిచినా అతీ గతి లేదన్నారు.

దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ ‌- బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని యువతను కోరారు హరీష్ రావు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలు.. రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లపై నిలదీయాలన్నారు.


Tags:    

Similar News