Harish Rao: పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి.. చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది
Harish Rao: కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ?
Harish Rao: కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది అని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. గాంధీ భవన్‌లో చిదంబరం మాట్లాడిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని హరీశ్‌రావు విమర్శించారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? అని నిలదీశారు. చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు.. చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.