Harish Rao: కేసీఆర్‌కు ఓటేస్తే.. సంక్షేమ తెలంగాణ
Harish Rao: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. సంక్షోభ తెలంగాణ
Harish Rao: బూతులు మాట్లాడే నాయకులకు .. పోలింగ్ బూతుల్లోనే ప్రజలు బుద్ది చెబుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీని ఎత్తిచూపే అంశాలు లేకపోవడంతో.. తిట్ల దండకం అందుకున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజుల్లో తిట్లు మాట్లాడే నాయకుడు కాదని.. మంచి భవిష్యత్ అందించే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్‌కు ఓటేస్తే.. సంక్షేమ తెలంగాణ వస్తుందని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. సంక్షోభ తెలంగాణ అవుతుందన్నారు.