Harish Rao: బీజేపీ ప్రభుత్వానికి అమ్ముడు తప్ప వేరేది తెలియదు
Harish Rao: సంగారెడ్డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని.. అమ్ముకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది
Harish Rao: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కార్మికులను ఏనాడు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఆడవాళ్లు అని చూడకుండా కాంగ్రెస్ పార్టీ గుర్రాలతో తొక్కించి.. లాఠీలతో కొట్టించిందన్నారు. మహిళ ఉద్యోగులను పిలిచి వారి సమస్యలను తీర్చి అన్నం పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్ముకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అమ్ముడు తప్ప వేరేది తెలియదన్నారు. బీజేపీ కార్మికుల వ్యతిరేక పార్టీ అని ఆయన మండిపడ్డారు.