Telangana Budget 2023: ఆయిల్‌ పామ్‌ సాగుకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు

Telangana Budget 2023: తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 7.4శాతం

Update: 2023-02-06 06:14 GMT

Telangana Budget 2023: ఆయిల్‌ పామ్‌ సాగుకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు

Telangana Budget 2023: తెలంగాణ వ్యవసాయ వృద్ధి దాదాపు రెండు రెట్లు అధికంగా నమోదు అయ్యింది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4శాతం కాగా.. తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 7.4శాతంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగాయన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందన్నారు.

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. దేశంలో భారీ ఎత్తున ఆయిల్‌ పామ్‌ దిగుమతి అవుతోందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును 20లక్షల ఎకరాలకు విస్తరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. దీంట్లో భాగంగా రైతులకు భారీగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు పెంచామన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు కోసం బడ్జెట్‌లో వెయ్యికోట్లు ప్రతిపాదించామన్నారు హరీష్‌రావు.

Tags:    

Similar News