Siddipet: సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన..2,800 ఎకరాల్లో పంట నష్టం

Siddipet: ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు

Update: 2024-03-25 09:29 GMT

Siddipet: సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన..2,800 ఎకరాల్లో పంట నష్టం

Siddipet: రెండు రోజులుగా కురిసిన వడగళ్ల వర్షానికి జిల్లాలోని రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఈదురుగాలులతో కురిసిన ఆకాలవర్గానికి సిద్దిపేట జిల్లాలోని మొత్తం 2800 ఎకరాల్లో వరి, మక్కజొన్న, మిర్చి, కూరగాయలకు పంటనష్టం వాటిల్లాగా, చిన్నకోడూర్ మార్కెట్ యార్డ్ లో నిలువ ఉన్న పొద్దుతిరుగుడు ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది, బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు,విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను అధికారులు అంచనవేసి ప్రభుత్వనికి నివేదిక ఇచ్చి ఆదుకోవాలి కోరుతున్నారు రైతులు.

జిల్లాలోని మొత్తం 2,800 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పంటలను చూసి రైతులు కన్నీరు మున్నీవుతున్నారు. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన వడగళ్ల వర్షానికి సుమారుగా 50వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. కేవలం 1100ల ఎకరాలకు మాత్రమే పంటనష్టం కింద సహాయం అందింది. రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News