ఇవాళ ఇందిరా భవన్‌లో హాత్‌ సే హాత్‌ జోడో సన్నాహక సమావేశం

* సా.4 గంటలకు రేవంత్‌ అధ్యక్షతన జరగనున్న భేటీ

Update: 2022-12-18 06:03 GMT

ఇవాళ ఇందిరా భవన్‌లో హాత్‌ సే హాత్‌ జోడో సన్నాహక సమావేశం

Congress: ఇవాళ ఇందిరా భవన్‌లో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్ సన్నాహక సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. డిసెంబర్‌ 4న ఏఐసీసీ స్టీరింగ్‌ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలు తాజా రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే జనవరి 26 నుంచి రెండు నెలల పాటు సమావేశాలు, పాదయాత్రలు ఉండే విధంగా కార్యాచరణ రూపొందించనున్నారు. మరోవైపు ఈ సమావేశానికి సీనియర్‌ నేతలు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. కొత్త కమిటీలపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీపీసీసీ కమిటీలపై స్పష్టత వచ్చే వరకు రేవంత్‌రెడ్డి నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉండాలని సీనియర్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇవాళ జరగనున్న సన్నాహక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల వ్యవహారంపై ఆ పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ఆరా తీశారు. పార్టీలో సీనియర్ల అసంతృప్తిని ఏ విధంగా సెట్‌ చేయాలనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న మహేశ్వర్‌ రెడ్డి నివాసంలో మరోసారి సీనియర్లంతా భేటీ కానున్నారు. ఇంకోవైపు సీనియర్లకు కౌంటర్‌ ఇస్తోంది టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ వర్గం. కాంగ్రెస్‌లో మొదట్నుంచీ ఉన్నవారికే 90 శాతం పదవులు వచ్చాయని మల్లు రవి అన్నారు. పార్టీకి డ్యామేజ్‌ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సీనియర్లు ఎందుకు స్పందించరని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ నిలదీ‎శారు.

Tags:    

Similar News