Greater Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కట్టడికి చర్యలు
Telangana: గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు.
Telangana: తెలంగాణలో కోరోన పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. జన సంచారం, ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహరాష్ట్ర, కర్నాటక నుండి వస్తున్న ప్రయాణీకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. కొద్ది నెలలుగా స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఆన్ లైన్ రిజర్వేషన్ ద్వారా ప్రయాణీకులను అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించిన ప్యాసింజర్లకు మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల్లో జ్వరం ఉన్నట్లు తేలిన ప్రయాణీకులను వెనక్కి పంపిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ 200 నుంచి 300 వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆర్టీసీ బస్సులను శానిటైజ్ చేసిన తర్వాతే డిపోల నుంచి బయటకు పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులు మాస్కులు ధరించేలా కండక్టర్లు చూస్తున్నారు. గత వారం నుంచి విద్యాలయాల బంద్ తో ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. ఆర్టీసీ ఆదాయం పడిపోతుంది. ఈ సమయంలో టార్గెట్ లు పెట్టడంపై కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో మెట్రో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. కోవిడ్ కి ముందు దాదాపు 5 లక్షల వరకు ప్రయాణించేవారు. ప్రస్తుతం 2 లక్షల మంది ప్రయాణికులు కూడ దాటడం లేదు. ప్యాసింజర్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించేలా మెట్రో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.