Governor Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలు పరిష్కరించదగ్గవే..
Basara Triple IT: మెస్, హాస్టల్, ల్యాబ్, లైబ్రరీని పరిశీలించిన తమిళిసై
Basara Triple IT: బాసర ట్రిపుల్ ఐటీని గవర్నర్ తమిళిసై సందర్శించారు. మెస్, హాస్టల్, ల్యాబ్, లైబ్రరీని స్యయంగా వెళ్లి పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని గవర్నర్తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను కలుసుకున్న గవర్నర్ క్యాంపస్‌లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు గవర్నర్దృష్టికి తీసుకొచ్చారు.
విద్యార్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. సమస్యలన్నీ పరిష్కరించదగినవేనని గవర్నర్ చెప్పారు. హాస్టల్‌లో మెస్ నిర్వహణ సరిగా లేదన్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు లేరని 2017 నుంచి వారికి ల్యాప్‌టాప్‌లు అందివ్వడం లేదని చెప్పారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మరోవైపు ప్రొటోకాల్ విషయంపై గవర్నర్ స్పందించారు. తన విషయంలో ప్రొటోకాల్ అంశం బహిరంగ రహస్యమేనని అన్నారు.