Governor Tamilisai Soundararajan : వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న శాస్ర్తవేత్తలకు ధన్యవాదాలు
Governor Tamilisai Soundararajan : శామీర్‌పేటలోని భారత్ బయోటెక్ సంస్థను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో శ్రమిస్తున్న ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నాని అన్నారు. శాస్ర్తవేత్తలు వ్యాక్సిన్‌పై అత్యంత శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారని తెలిపారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరిని నిర్మూలించడానికి శాస్త్రవేతలు శ్రమిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు భారత్‌లోనే కరోనా వ్యాక్సిన్ తయారీకి అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శాస్ర్తవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టారని చెప్పారు.
తన పర్యటన ముఖ్య ఉద్దేశం కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని మరింత ఏకాగ్రతతో ముందుకుసాగేలా ప్రేరేపించడమేనని అన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేస్తున్న 'కొవాగ్జిన్' త్వరలో అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తక్కువ ధరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భారత్ బయోటెక్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. అనంతరం గవర్నర్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు దేశంలో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. 2020 లోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.