Governor Tamilisai: తమిళిసై సంచలన నిర్ణయం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ
Governor Tamilisai: అభ్యర్థిత్వాల సిఫార్సులను తిరస్కరించిన గవర్నర్
Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు గవర్నర్. ఇటీవల గవర్నర్ కోటాలో.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎంపిక చేసింది బీఆర్ఎస్. అయితే ఆర్టికల్ 171 ( 5 ) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదనే కారణంతోనే అభ్యర్థిత్వాలను తిరస్కరించినట్లు గవర్నర్ తెలిపారు. రాజకీయ నేతలను కాకుండా.. సామాజిక, సాంస్కృతిక అంశాల ప్రాతిపదికనే గవర్నర్ కోటాకు సిఫార్సు చేయాలన్నారు గవర్నర్..
గతంలో కూడా పాడి కౌశిక్ విషయంలో సేమ్ ఇలాగే జరిగింది. అప్పుడు కూడా గవర్నర్ కోటా కింద ఉన్న కౌశిక్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రగతి భవన్ , రాజ్ భవన్ మధ్యలో గ్యాప్ పూడ్చ లేనంతగా పెరిగింది. ఇప్పుడు కూడా అప్పటిలాగానే జరగడంతో ముందు ఏం జరగబోతుందనే టెన్షన్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.