Kunamneni: తెలంగాణలో మోడీ పర్యటనను అడ్డుకుంటాం.. గవర్నర్ తమిళిసై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలి..

Kunamneni Sambasiva Rao: ప్రధాని మోడీ తెలంగాణకు రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-11-08 09:57 GMT

Kunamneni: తెలంగాణలో మోడీ పర్యటనను అడ్డుకుంటాం.. గవర్నర్ తమిళిసై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలి..

Kunamneni Sambasiva Rao: ప్రధాని మోడీ తెలంగాణకు రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మోడీ వస్తున్నారు. మునుగోడు ఎన్నిక తరువాత విజయం సాధించి ఈ ఫ్యాక్టరీ ప్రారంభం చేద్దామనేది అసలు ప్లాన్ అని అన్నారు. కానీ, బీజేపీ ఓటమి పాలైందని విమర్శించారు. అయినా.. గతేడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. తాము ఏదో చేశామని అంతా బీజేపీ ఖాతాలో వేసుకోవాలన్నదే ప్లాన్ గా కనిపిస్తోందని అన్నారు సాంబశివరావు.

సడెన్ గా తెలంగాణపై అంత ప్రేమ ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారని అడిగారు. విభజన చట్టంలోని ఏఒక్క హామీ అయినా నెరవేర్చరా? అని నిలదీశారు కూనంనేని. ప్రధాని తెలంగాణకు రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని అన్నారు. ఈనెల 10 నుండి బొగ్గు కర్మాగారంలో ఆందోళన చేస్తామని తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు.

గవర్నర్ వ్యవస్థపై కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మంత్రులను తన ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారు. మీరు గవర్నరా.. లేక బీజేపీ కార్యకర్తనా.. ముందు తేల్చాలి'' అని అన్నారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణలో గవర్నర్ ల తీరు సరిగా లేదని అన్నారు. గవర్నర్ ల వ్యవస్థ సరిగా లేదని, బ్రిటీష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలన్నారు. మేము మా జాతీయ మహాసభల్లో కూడా తీర్మానం చేస్తామన్నారు. తమిళిసై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని త్వరలో పెద్ద ఎత్తున రాజ్ భవన్ ముట్టడి చేస్తామని హెచ్చారించారు.

Tags:    

Similar News