తెలంగాణలో ధరణి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్

పెండింగ్‌ దరఖాస్తులు వారంలో పరిష్కరించాలని ఆదేశం

Update: 2024-06-16 02:00 GMT

తెలంగాణలో ధరణి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్

Dharani: తెలంగాణలో ధరణి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లను వారం రోజుల్లోగా పరిష్కరించాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. డేటా కరెక్షన్స్, మ్యుటేషన్, సక్సేషన్ లాంటి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్‌లో ఉండండంతో నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

 అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలు ఎదుర్కొంటున్నాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ సమస్యల నుంచి రిలీఫ‌ కలిగించేందుకు ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి భూ సంబంధిత వ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన మార్పులు అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థలోని ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్‌ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ప్రభుత్వం నియమించిన కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ యాక్ట్‌ను పరిశీలించింది. భూ వివాదాల పరిష్కార కోసం రెవెన్యూ ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించింది. ధరణి పోర్టల్‌ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రీతిలో ధరణి పోర్టల్‌లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం.

 గత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్ట్-బిలో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన విధానంపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు సీసీఎల్‌ఏ అధికారులు. ఇప్పటికే సంబంధిత తహశీల్దార్ల లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించనున్నారు. ఇక మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారు. డేటా సవరణలు, మ్యుటేషన్స్, సక్సేషన్ లాంటి అప్లికేషన్లు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించారు సీసీఎల్‌ఏ అధికారులు.

Tags:    

Similar News