ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రి నుండి ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ‌..

Update: 2020-12-29 14:10 GMT

నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని అదేవిధంగా అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 9,36,976 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఓ కమిటిని నియమించారు.

కొత్త ఏడాదిలో మార్చి నుంచి ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకూ వేతనాలు పెంచాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు.

Tags:    

Similar News