Telangana: రేషన్ కార్డు దారులకు శుభవార్త
Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కష్టకాలంలో ఆదుకునేందుకు మరోసారి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌తో కొందరికి ఉపాధి లేకుండా పోయింది. మరికొందరికి పని ఉన్నా కూడా కరోనా భయంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను కూడా విడుదల చేసింది.
జూన్ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 82.50 లక్షల రేషన్ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది.