School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. సోమవారం పాఠశాలలకు సెలవు ..కారణం ఇదే

Update: 2024-12-07 15:50 GMT

School Holidays: విద్యార్థులకు ఈమధ్యకాలంలో సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. పండగలు, వర్షాలతో ఇప్పటికే భారీగా సెలవులు వచ్చాయి. అయితే డిసెంబర్ నెలలో మాత్రం కాస్త తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ పండగలు తక్కువగా ఉన్నాయి. అయితే క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా రెండు రోజులు మాత్రమే సెలవులు రానున్నాయి. కొన్ని క్రిస్టియన్ స్కూళ్ల కు మాత్రం 5రోజులు సెలవులు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ కూడా రావడంతో విద్యార్థులకు వరుసగా మరోసారి సెలవులు రానున్నాయి.

అయితే తాజాగా మరోసెలవు వచ్చింది. డిసెంబర్ 9వ తేదీన సోమవారం పాఠశాలలకు సెలవు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ములుగు జిల్లాల్లోని చల్పాక అడవుల్లో ఈనెల 1వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ నిరసనగా ఈ నెల 9వ తేదీన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడంతో సోమవారం పాఠశాలలకు సెలవు ఉంటుందని తెలుస్తోంది.

ఈ మేరకు మావోయిస్టు పార్టీ కూడా లేఖ విడుదల చేసింది. ఈ ఎన్ కౌంటర్ కు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో హెచ్చరించారు. ఈ ఘటనకు నిరసనగా 9వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజలు స్వచ్చందంగా పాల్గొని ఈ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కారణంగా రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలు బంద్ ను పాటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం ఉండే అవకాశం ఉంది.

ఒకవేళ 9వ తేదీన సెలవు ఇస్తే విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చినట్లు అవుతుంది. ఆదివారం ఎలాగో పాఠశాలలకు సెలవు ఉంటుంది. సోమవారం కూడా బంద్ ఉన్నట్లయితే వరుసగా రెండు రోజులు సెలవులు ఉంటాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం సోమవారం సెలవు ఉండదు.

Tags:    

Similar News