Golconda Fort: జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

Golconda Fort: ఇండిపెండెన్స్‌డే వేడుకలకు సిద్ధమైన గోల్కొండ కోట

Update: 2022-08-15 01:14 GMT

Golconda Fort: జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

Golconda Fort: ఇండిపెండెన్స్‌డే వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమయ్యింది. సీఎం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా గోల్కొండ కోటలోనే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుంది. దానికి ముందు ముఖ్యమంత్రి... పోలీసు గౌరవ వందనం స్వీకరించనున్నారు. దాదాపు వెయ్యి మంది కళాకారులతో స్వాగత ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు నిర్ణయించారు. మరోవైపు 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా కొద్ది మంది లబ్దిదారులకు సీఎం పింఛన్ కార్డులు అందజేస్తారు. స్వతంత్ర భారత వజ్రోత్సావాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. 75వ ఇండిపెండెన్స్‌ డే వేడుకల్లో ఉన్నతాధికారులు, వీఐపీలతో పాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొంటారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఆయా విభాగాల అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ఎవరికి ఎలాంటి అసౌకర్యం జరక్కుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పోలీస్‌ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి ప్రతి కదలికలను పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తారు.

Tags:    

Similar News