స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

Golconda Fort: గోల్కొండ కోటలో భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు

Update: 2022-08-14 01:02 GMT

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

Golconda Fort: 75వ భారత స్వాత్రంత్ర్య వేడుకలకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ సోమేష్ కుమార్, ఇతరపోలీసు ఉన్నతాధికారులు ఈ వేడుకల ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కోండ కోట మువ్వెన్నెల రంగులతో కాంతులీనుంతోంది.

15న ఉదయం పదిన్నరకు ముఖ్యమంత్రి గోల్కొండలో జాతీయ పతాకావిష్కరణ చేసి.. పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా వెయ్యిమంది కళాకారులతో సీఎంకు స్వాగతం పలికేలా అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. ఇక పతాకావిష్కరణ అనంతరం.. పోలీస్ దళాలు సీఎంకు రాష్ట్రీయ సైల్యూట్‌ను అందిస్తాయి. దీంతో ‎ప్పటికే గోల్కొండ ఫోర్ట్ ను తమ ఆదీనంలోకి తీసుకున్న పోలీసులు అణువణువునా తనిఖీలు చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోటపై 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు.. వీటన్నింటినీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తోపాటు, స్థానిక పీఎస్ కు అనుసంధానం చేశారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరును తెలుసుకునేందుకు సీసీసీ అధికారులు ట్రయల్ రన్‎ను ఏర్పాటు చేశారు. ఇక నిఘా వర్గాల హెచ్చరికల ననేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరవ్యాప్తంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. గోల్కొండ కోట ఎంట్రెస్ మొదలు..అడుగడుగునా.. మెటల్ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లను జారీచేసింది. అక్కడికి వచ్చిన వారందరూ కార్యక్రమాన్ని వీక్షీంచేందుకు వీలుగా ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల కోసం గోల్కొండకు వచ్చే వారికి మంచినీటి సౌకర్యం, వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఈవేడుకల నేపథ్యంలో గోల్కొండ పరిసరాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, అధికారులు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా రాందేవ్ గూడ నుంచి కోటలోకి వెళ్లే A, B, C పాస్ హోల్డర్స్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఇక సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం నుంచి వచ్చే పాస్ హోల్డర్స్ రేతి బౌలి, నానల్నగర్ జంక్షన్ నుంచి లంగర్ హౌజ్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రాందేవ్ గూడ జంక్షన్ మీదుగా మల్లించారు. ఏ,బీ, సీ, డీ, ఈ పాస్ హోల్డర్స్ తమతమ వాహనాలు పార్క్ చేసుకునేలా ఏర్పాట్టు చేశారు.

ఇక కోటలో భారీగా లైటింగ్ తో పాటు.. కోట జెండా రంగుల్లో కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో కోటల మొత్తం జాతీయజెండా రంగులలో మరిం శోభాయమానం కనువిందు చేస్తోంది. గోల్కోండ కోటలో జరుగుతున్న స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఫ్లాగ్ హోస్టింగ్, పోలీస్ పరేడ్, స్టేజీ, సాంస్కృతి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎప్పికప్పుడు ఆరా తీసినసోమేష్ కుమార్ లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.

Tags:    

Similar News