Godavari Floods: తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ

Godavari Floods: కాళేశ్వరం వద్ద గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి

Update: 2022-09-12 04:15 GMT

Godavari Floods: తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ

Godavari Floods: ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం వద్ద గంట గంటకు గోదావరి ఉధృతి పెరుగుతోంది. జలాశయాలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద గోదావరి వద్ద నీటి మట్టం 11.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. అటు లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, అవుట్ ఫ్లో 8లక్షల 12 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇక సరస్వతీ బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ ప్లో, అవుట్ ప్లో 7లక్షల 90వేల క్యూసెక్కులుగా ఉంది.

Tags:    

Similar News