జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ.. ఎంఐఎం టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా..?

*జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ *రేపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక *మేయర్ రేసులో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం

Update: 2021-02-10 11:54 GMT
మేయర్ ఎన్నిక

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ఇక మరికొద్ది గంటలే మిగులుంది. మేయర్ పీఠం మాదంటే మాదంటూ ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. కానీ, అంతిమంగా కౌన్ బనేగా మేయర్ అన్నదే ఉత్కంఠ రేపుతోంది. నిన్నటివరకు ఏ పార్టీ కూడా... మేయర్ ఎన్నికపై స్పందించకపోవడంతో టీఆర్ఎస్‌దే అని భావించారంతా. కానీ తామూ బరిలో దిగుతామని బీజేపీ ప్రకటించడంతో గ్రేటర్ రాజకీయం రసవత్తరంగా మారింది.

అయితే, ఏ పార్టీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధి ఎవరనేది సీల్డ్ కవర్ నిర్ణయించనుంది. బీజేపీ పోటీ చేస్తామని చెప్పినా అభ్యర్థి పేరు మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇక, ఎంఐఎం టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా..? లేక రేసులో ఉంటుందా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని ఎంఐఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, మేయర్ ఫైట్ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే జరిగేలా కనిపిస్తోంది.

ఇక, బలాబలాల విషయానికొస్తే టీఆర్ఎస్ ముందుంది. ఆ పార్టీకి ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలిపి మొత్తం 88 మంది బలం ఉంది. బీజేపీకి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపితే 49 మందే ఉండగా... ఎంఐఎంకు 54 మంది బలం ఉంది. అయితే ఎంఐఎం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారింది. ఎంఐఎం ఓటింగ్ కు వస్తే ఎవరికైనా మద్దతివ్వాలి... లేదంటే ఎవరి మద్దతుతో అయినా మేయర్ స్థానం కైవసం చేసుకోవాలి. అయితే మజ్లిస్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుండటంతో.... 88మంది సభ్యుల బలం ఉన్న టీఆర్ఎస్ బల్దియా పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News