వరద సహాయం కోసం బాధితులు మీసేవ సెంటర్లకు రావొద్దు : GHMC కమిషనర్
డిసెంబర్ 7వ తేదీ నుంచి మళ్లీ వరద సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇవాళ మళ్లీ వరద సహాయం కోసం బాధితులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్‌లో వరద సహాయం కోసం బాధితులు మీసేవ సెంటర్ల వద్ద బారులు తీరారు. గ్రేటర్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం వరద సహాయాన్ని ఆపేసింది. అయితే డిసెంబర్ 7వ తేదీ నుంచి మళ్లీ వరద సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇవాళ మళ్లీ వరద సహాయం కోసం బాధితులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద సహాయం కోసం బాధితులు ఎవరూ మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదన్నారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి... ఇంకా వరద సహయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధృవీకరించుకున్న తర్వాత.. వారి అకౌంట్‌లోకి నేరుగా వరద సహాయం డబ్బు జమఅవుతోందన్నారు.