Ganesh Chaturthi: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ఘనంగ వినాయక చవితి వేడుకలు

Ganesh Chaturthi: తెలంగాణలోని ప్రతి జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

Update: 2021-09-10 08:10 GMT

రాష్ట్ర వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Ganesh Chaturthi: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ఘనంగ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి, రాష్ట్రంలోని పలు జిల్లాలో కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. పండుగ పర్వదినం రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా:

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో మట్టి వానాయకులను ప్రతిష్టిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా మట్టి వినాయకుల ప్రతిష్ట జరుగుతుంది.

నల్గొండ జిల్లా:

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణనాథులు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. వాడవాడలా గణనాథులను ఏర్పాటు చేసి.. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మట్టి గణపయ్యకు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎస్పీ డీఐజీ రంగనాథ్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిజామాబాద్‌ జిల్లాలో చవితి వేడుకలు:

సకల లోకాలకు ఆది దేవుడు.. విఘ్నాలు తొలగించే వినాయకుడి నవరాత్రి వేడుకలు నిజామాబాద్‌ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే.. ఇందూరు ప్రజలు మాత్రం.. మట్టి విగ్రహాలకు జై కొడుతున్నారు. మట్టి గణపతులను ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో.. మట్టి గణపతులకు డిమాండ్ పెరిగింది.

హైదరాబాద్‌లో ఘనంగా చవితి వేడుకలు:

హైదరాబాద్‌లో గణేష్‌ చతుర్థి వేడుకలు మొదలయ్యాయి. ముక్కోటి దేవతల్లో తొలిపూజలు అందుకునే ఆది దేవుడు విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు భక్తులు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు.

మనుషుల మధ్య తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా నిర్వహించుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. తొమ్మిది రోజుల పాటు.. ప్రతిరోజూ పూజలు అందుకుంటూ జరిగే ప్రత్యేక పండుగ ఈ వినాయక చవితి. అలాంటి పండుగ వేడుకలు ఈసారి కరోనా నిబందనల నడుమ జరగుతున్నాయి.

కాజీపేట:

గణపతి నవరాత్రులంటేనే ఊరూ వాడ పండుగ. అటువంటి నవరాత్రుల్లో స్వామివారిని ప్రకృతితో మేళవించి పూజిస్తారు. కాజీపేటలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో 16రోజులపాటు ఉత్సవాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News