Hyderabad: హైదరాబాద్ మధురానగర్‌లో దొంగ మృతి
Hyderabad: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ డబ్బా మీదపడటంతో దొంగ అక్కడికక్కడే మృతి
Hyderabad: హైదరాబాద్ మధురానగర్‌లో దొంగ మృతి చెందాడు. ఓ స్వీట్ షాపు ముందున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో దొంగ చోరీకి పాల్పడే ప్రయత్నం చేశాడు. రాడ్‌తో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డోర్ బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ డబ్బా మీద పడటంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. చోరీ ప్రయత్నం చేసే విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగ ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.