స్విగ్గీలో ఫలోంకి రాజా ఆమ్
కమ్మని నోరూరించే బిర్యానీలు, ఇష్టమైన ఆహార పధార్ధాలు తినాలనుకుంటే చాలు వెంటనే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటుంటారు.
కమ్మని నోరూరించే బిర్యానీలు, ఇష్టమైన ఆహార పధార్ధాలు తినాలనుకుంటే చాలు వెంటనే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు అదే స్విగ్గీ ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన మామిడి పండ్లను కూడా డోర్ డెలివరీ చేస్తూ పండ్లను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సహజ సిద్దంగా పండిన మామిడిపండ్లను తీసుకోవాలనుకునే వారు బయటికి వెల్లకుండా స్విగ్గీలో ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకుంటే చాలు వెంటనే రుచికరమైన పండ్లు మీ గుమ్మం ముందు ఉండనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యంతో 14 జిల్లాల్లో ఎంపిక చేసిన రైతుల నుంచి సెర్ప్ మామిడికాయలను సేకరించి వాటిని 'బెనిషాన్' పేరుతో విక్రయిస్తున్నది.
ఇప్పటికే ఈ బెనిషాన్ లు వాల్‌మార్ట్, బిగ్‌బాస్కెట్, మెట్రో, 24 మంత్ర, క్రిషియోగా మార్ట్‌లలో కూడా బెనిషాన్ బ్రాండ్ మామిడి అందుబాటులో ఉన్నాయని సెర్ప్ సీవోవో రజిత తెలిపారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టిన అధికారులు ఇప్పటి వరకు 500 టన్నుల మామిడిని సేకరించి, 400 టన్నుల వరకు విక్రయించారు. ప్రస్తుతం డోర్ డెలివరీ ద్వారా అందరికీ వీటిని అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేసామని తెలిపారు. అందుకోసం గతంలోనే మామిడిపండ్ల డోర్ డెలివరీకి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) స్విగ్గీతో ఒప్పందం చేసుకుంది. కానీ అనుకోకుండా విజృంభించిన కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ విధించడంతో అప్పుడు అమలు కాకుండా ఇప్పుడు అమలు అవుతుంది. డెలివరీ సేవలను వినియోగించుకోవాలని రజిత తెలిపారు. కావాల్సినవారు 6301295843 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఆమె సూచించారు. హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలు, ఫ్లాట్‌లలో ఉండేవారు 100 కిలోల వరకు ఆర్డర్ ఇస్తే సెర్ప్ ద్వారా నేరుగా పండ్లను ఇంటికి సరఫరా చేస్తామని తెలిపారు