ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఉచిత శిక్షణ

Telangana: ఈనెల 16తేదీన ఆన్‌లైన్లో అర్హత పరీక్షతో అభ్యర్థుల ఎంపిక

Update: 2022-04-07 03:30 GMT

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఉచిత శిక్షణ

Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బెంగళూరు అన్ అకాడమీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో ఒక లక్షా 25 వేలమందికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ప్రభుత్వంనుంచిగానీ, అభ్యర్థులనుంచి పైసా వసూలు చేయకుండా ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. 16 తేదీన అభ్యర్థులకు ఆన్ లైన్లో టెస్టు నిర్వహించి అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. గ్రూపు వన్, గ్రూప్ త్రీ, ఎస్ఐ పోటీ పరీక్షలకు ఎంపికైన విద్యార్థులకు ఉచిత శిక్షణ, స్టైఫండ్ ఇస్తామని తెలిపారు.

Tags:    

Similar News