Sangareddy District: సదాశివపేట పట్టణంలో ఉచిత అంబులెన్స్ సేవలు

Sangareddy District: ఉచిత అంబులెన్స్, ఆయుర్వేదిక్ చికిత్స అందిస్తున్న మానవతవాది

Update: 2021-02-25 06:42 GMT

Representational Image

Sangareddy District: చేతిలో 3 నెలల పసికందు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పసికందు చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్ కు 3500 కావాలి. అది చెల్లించలేని దయనీయ పరిస్థితి కారణంగా ఆ చంటి బిడ్డను కోల్పోయాడు ఓ తండ్రి. తన లాంటి కష్టం ఎవరికి రావద్దని రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కో రూపాయి కూడ బెట్టి... పిల్లల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించాడు ఓ మానవతవాది.

మీరు చూస్తున్న ఇతని పేరు సయ్యద్ అంజాద్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఫ్రీగా ఆయూర్వేదిక్ చికిత్స చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం తన 3 నెలల కుమారుడు అనారోగ్యంతో కన్నుమూసాడు. చికిత్స కోసం అంబులన్స్ లో హైదరాబాద్ తీసుకెళ్లేందుకు చేతిలో 3500 రూపాయలు లేక తన కొడుకును కోల్పోయాడు అంజాద్. తనకొచ్చిన కష్టం ఏ తండ్రికి రాకూడదని ఉచిత అంబులెన్స్ సేవలు చేపట్టాలని అంజాద్ ఆ రోజే నిర్ణయించుకున్నారు.

లాక్ డౌన్ సమయంలో సైతం అంజద్ స్వయంగా వంట చేసి రోజూ వందాలది మందికి ఉచిత భోజనంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా కాలంలో చేసిన సేవలకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పనులకు తోడు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్యం ను సైతం ఉచితంగా అందిస్తూ అందరి ఆదరణ పొందుతున్నారు. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నానని ఆలోచించకుండా తనకు వచ్చిన కష్టం ఇంకెవరికి రావద్దని, తనలా ఎవరూ బాధపడకూడదని అంజద్ చేస్తున్న సేవలు నిజంగా అభినందనీయం.

Tags:    

Similar News