ఎంఐఎం, టీఆర్ఎస్‌ పార్టీలపై మాజీ ఎంపీ విజయశాంతి ఫైర్

Update: 2020-11-25 10:33 GMT

ఎంఐఎం, టీఆర్ఎస్‌ పార్టీలపై మాజీ ఎంపీ విజయశాంతి నిప్పులు చెరిగారు. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థానీలపై సర్జికల్‌ జరుపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటిస్తే.. ఆ రెండు పార్టీలు ఎందుకు ఉలిక్కిపడుతున్నాయని విజయశాంతి ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. పాతబస్తీలో 'రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తే.. అధికార పార్టీ క్లారిటీ ఇవ్వాలి తప్పా ఎదురుదాడికి దిగడంలో అర్థం లేదన్నారు. గతంలో కలిసిమెలిసి ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికల ముందు ఏం సంబంధం లేనట్టు డ్రామాలు ఆడుతున్నాయని ఆమె మండిపడ్డారు.

విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. త్వరలో విజయశాంతి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బీజేపీకి బహిరంగంగానే మద్దతు తెలపడంతో ఆమె త్వరలోనే కాంగ్రెస్ వీడతారన్న వ్యాఖ్యలకు బలం చేకూరింది.

Full View


Tags:    

Similar News