KTR: రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు

KTR: అమర్‌రాజా సంస్థ రాష్ట్రాన్ని వీడుతున్నట్టు వార్తలు రావడం దురదృష్ఠకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Update: 2024-08-11 09:56 GMT

KTR

KTR: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి లేకపోతే.. రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర్‌రాజా సంస్థ చెబుతున్నట్లు వార్తలు రావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమర్‌రాజా సంస్థ రాష్ట్రాన్ని వీడుతున్నట్టు వార్తలు రావడం దురదృష్ఠకరమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయిందని.. వీటితోపాటు కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతుంటే తెలంగాణ బ్రాండ్ కు ఇది తీవ్ర నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టటం ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. 

Tags:    

Similar News