నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ఉధృతి

Nagarjuna Sagar: మొత్తం 26 గేట్లు ఎత్తిన అధికారులు

Update: 2022-08-12 02:36 GMT

నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ఉధృతి

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో.. ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు అన్నీ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో.. మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 2009, 2019 తర్వాత మరోసారి ఈ ఏడాదిలో మొత్తం 26 గేట్లు ఎత్తినట్లు.. అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాగర్‌ ఇన్ ఫ్లో 4 లక్షల 38 వేల 446 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 3 లక్షల 36 వేల 672 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 306.1 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Tags:    

Similar News