Fitness Test: స్కూల్ బస్సులకు పూర్తికాని ఫిట్‌నెస్ టెస్టులు
Fitness Test: ఇన్నాళ్లు షెడ్డూలకే పరిమితమైన స్కూల్ బస్సులు * స్కూల్ బస్సుల నిర్వహణపై పేరెంట్స్‌కు అనుమానాలు
Fitness Test: తెలంగాణలో పాఠశాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. స్కూల్స్ తెరవగానే చాలా మంది పిల్లలు స్కూల్ బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఇన్నాళ్లు షెడ్డులకే పరిమితమైన స్కూల్ బస్సులు ఇప్పుడు సేఫ్‌గా ఉన్నాయా ఆర్టీవో అధికారులు వాటి ఫిట్‌నెస్‌ను చెక్ చేస్తున్నారా ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో జర్నీ ఎంత వరకు సేఫ్..?
పిల్లలను స్కూల్‌కు తీసుకువెళ్లే వాహనాలపై ఆర్టీవో అలెర్ట్‌గా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదాన్ని ఊహించలేం. అందుకని ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌లో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్ లు చేస్తుంది. అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉంటేనే పిల్లలను తరలించేందుకు అనుమతి ఇస్తారు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 10వేల 5వందల స్కూల్ బస్సులను ప్రతి ఏటా ఫిట్‌నెస్ పరీక్షలు చేస్తారు.
కానీ స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలపై ఆర్టీవో దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో మొక్కబడిగా చెక్ చేసి రైట్ రైట్ అంటున్నారని విమర్శిస్తున్నారు. ఆటోలు, వ్యాన్ల నిర్వహణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్ లో చాలా వరకు కాలం చెల్లిన బస్సులు కనిపిస్తున్నాయి. వాటిని రిపేర్ చేయించకుండా కార్పొరేట్ యాజమాన్యాలు నడిపిస్తున్నాయి.
స్కూళ్ల ప్రారంభంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో మరో వారంపాటు ప్రైవేట్ స్కూళ్ల యజమానులకు టైం దొరికింది. ఈ వారం రోజుల్లోనైనా బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్‌లు చేయించుకుంటారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా స్కూల్ బస్సులకు రోడ్డు ట్యాక్స్ ఎత్తివేయాలని డిమాండ్ ప్రైవేట్ స్కూళ్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు షెడ్డులకే పరిమితమైన బస్సులకు రోడ్డు ట్యాక్ ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు.
బస్సుల కండీషన్‌తో పాటు బస్సు పత్రాలు, డ్రైవర్ సామర్థ్యం అన్ని సరిగ్గా చూసుకోవాలని రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ యజమానులకు సూచిస్తున్నారు. వాహనాలను తప్పనిసరిగా శానిటేషన్ చేయాలని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.