Firing At Nampally: నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కాల్పుల కలకలం

Firing At Nampally: హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

Update: 2024-07-12 02:18 GMT

హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. గురువారం అర్థరాత్రి నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా..వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఉస్మానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారంతా దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News