Telangana: తెలంగాణలోని రైస్ మిల్లులపై ఏకకాలంలో FCI దాడులు

Telangana: 2020-21 వానాకాలం, యాసంగి సీజన్ల నిల్వలపై FCI ఆరా

Update: 2022-05-03 02:58 GMT

Telangana: తెలంగాణలోని రైస్ మిల్లులపై ఏకకాలంలో FCI దాడులు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లులపై ఏకకాలంలో FCI అధికారులు దాడులు చేశారు. రాష్ట్రంలోని 3,278 మిల్లుల్లో 2020-21 వానాకాలం, యాసంగి సీజన్ల నిల్వలపై FCI అధికారులు 60 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించిన తనిఖీల్లో రైస్ మిల్లుల బాగోతం బయట పడింది. రాష్ట్రం నుంచి FCI కి 5.50లక్షల మెట్రిక్ టన్నుల CMR రైస్ బకాయిలు ఉన్నాయని తెలిపింది. అయితే FCI ఇచ్చిన గడువు ముగియడంతో తనిఖీలు చేపట్టారు.

రైస్ మిల్లర్లతో అగ్రిమెంట్ ప్రకారం నవంబర్ లోనే బియ్యాన్ని తీసుకొని వెళ్ళాలి. కానీ దీనికి బాధ్యులు ఎవరు, వాళ్లకు గోదాంలు లేక తమ దగ్గరే రైస్ పెట్టి ఇలా బద్నాం చేయడం కరెక్ట్ కాదంటున్నారు రైస్ మిల్లర్స్. రాష్ట్ర ప్రభుత్వం తమకు డబ్బులు ఇస్తుంది తాము రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యం ఇస్తాం మధ్యలో ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

FCI వాళ్ళు అడుగుతుంది 2 శాతం మాత్రమే. కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తే 4.5 నుండి 5 లక్షల బియ్యం తేడా వస్తుంది. ఒక్కరు ఇద్దరు తప్పు చేస్తే అందరిని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు రైస్ మిల్లర్స్. 

Full View


Tags:    

Similar News