Farmers Fair: జోగులాంబ జిల్లా ఉత్తనూర్‌లో రైతు మేళా

*ఆధునిక పనిముట్లపై 40 స్టాళ్లలో ప్రదర్శన *వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులు

Update: 2021-10-21 03:35 GMT

జోగులాంబ గద్వాల్ జిల్లా (ఫైల్ ఫోటో)

Farmers Fair: రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుని, అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలలు అభిప్రాయపడ్డారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆరుతడి పంటల సాగుపై జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తనూర్‌ గ్రామంలో రైతు మేళా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే అబ్రహం, రైతులు సందర్శించారు.

ఆధునిక యుగంలో నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించుకుని పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని జోగులాంబ జిల్లా కలెక్టర్‍ వల్లూరు క్రాంతి అన్నారు. రైతులు మూస పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక టెక్నాలజీ, ఆధునిక యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News