Farmer protest In Yadadri: న్యాయం చేయాలంటూ రైతు ఆత్మహత్యాయత్నం

Farmer protest In Yadadri: దేశానికి అన్నం పెట్టే రైతులు ఏ కార్యాలయానికి వెళ్లినా వారికి న్యాయం జరగడం లేదని మరో సారి రుజువైంది. భూమి సమస్యలు ఉన్నప్పుడు రైతులు ఎన్ని సార్లు తహసీల్దార్ కార్యలయాల చుట్టూ తిరిగినా అధికారులు రైతులను పట్టించుకోరు

Update: 2020-07-27 14:23 GMT
ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రైతు

Farmer protest In Yadadri: దేశానికిరైతే వెన్నుముక‌, రైతే రాజు అనేవి ఉట్టి మాట‌లేన‌ని మ‌రోసారి రుజువైంది. భూమి సమస్యలు ఉన్నప్పుడు రైతులు ఎన్ని సార్లు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు రైతులను పట్టించుకోరు. కానీ రైతులు మాత్రం ఉదయం లేవగానే ఈ రోజైనా తమ పని సక్రమంగా జరుగుతుందేమో అని ప్రతి రోజు కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా నడుస్తుంటారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి ఎంతో మంది రైతులు తమ ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. కేవలం తహశీల్దార్ కార్యాలయాలలో మాత్రమే కాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రైతుకు కూడా న్యాయం జరగడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో నర్సయ్య అనే రైతు తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టాడు. కష్టపడి సాగు చేసి నాట్లేసిన వరి పంటను కొంత మంది ధ్వంసం చేసారని, ఆ నిందితులను అరెస్టు చేయాలని ఆ రైతు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. కానీ అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని ధర్నాకు దిగాడు. పంటను నాశనం చేసి తన భూమిని ఆక్రమ క్రమంగా కాజేయాలని కొంత మంది ప్రయత్నం చేస్తున్నారని వారిని, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశాడు. తన సమస్యను ఎవరూ పట్టించుకోక పోతే తనకు చావే శరణ్యమని అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్‌ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయానికి అటుగా వెలుతున్న కొంత మంది స్థానికులు అది గమనించి రైతును అడ్డుకున్నారు. రైతుకు తప్పని సరిగా న్యాయం చేయాలని తెలిపారు.

Tags:    

Similar News