కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ వరి ధాన్యం కేంద్రంలో విషాదం

* గుండెపోటుతో ధాన్యంపై కుప్పకూలిన రైతు బీరయ్య * కొనుగోళ్ల ఆలస్య కారణంగా ధాన్యం కుప్ప దగ్గర నిద్రిస్తోన్న రైతులు

Update: 2021-11-05 12:00 GMT

గుండెపోటుతో ధాన్యంపై కుప్పకూలిన రైతు

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి చెందాడు. గుండెపోటుతో ధాన్యం కుప్పపై ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బీరయ్య కుప్పకూలాడు. కొనుగోలు ఆలస్యం కారణంగా ధాన్యం కుప్ప వద్ద నిద్రిస్తూ మరణించాడు.

వారం రోజుల కిందట వడ్లను కొనుగోలు సెంటర్‌కు తీసుకొచ్చాడు రైతు బీరయ్య. రోజూ వడ్లకుప్ప దగ్గర కాపలా ఉంటున్నాడు. నిన్న రాత్రి ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ సెంటర్‌కు వచ్చి వడ్ల కుప్ప దగ్గరే నిద్రపోయాడు. ఉదయం రైతు బీరయ్య ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య కొనుగోలు సెంటర్‌కు వచ్చి చూసింది. అప్పటికీ బీరయ్య నిద్ర లేవలేదు. ఎంత అరిచిని ఆయన మేల్కోలేదు.

తెలంగాణ ప్రభుత్వం వడ్లు కొంటున్నామని ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటూ పోతుంది. కానీ గ్రౌండ్ లో పరిస్థితి దారుణంగా ఉందంటూ మండిపడుతున్నారు రైతులు. వడ్లు కొంటున్నారని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు అన్నదాతలు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తూ ఓ రైతు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News