Telangana: రైతు పొలంలో లంకె బిందె.. తెరిచి చూస్తే..
Telangana: ఎవరికో చిన్న బంగారం వస్తువు దొరికిందని వింటే ''అవునా'' అని కళ్లు తేలేస్తాం.
Telangana: ఎవరికో చిన్న బంగారం వస్తువు దొరికిందని వింటే ''అవునా'' అని కళ్లు తేలేస్తాం. కిలో బంగారం దొరికిందటేనే గుండె ఒక్కక్షణం ఆగిపోయి, వెంటనే నూట డెబ్భైసార్లు కొట్టుకుంటుంది. ఇక లంకె బిందెలు పేరు వింటే చాలు సంగతులు. ఊహాల్లోనే మేడలు కట్టేస్తాం. అలాంటిది జనగామ జిల్లాలోని ఓ పొలంలో 5కిలో బంగారం బయటపడింది.
జనగామ జిల్లా పెంబర్తిలో లంకెబిందె దొరికింది. నర్సింహా అనే వ్యక్తి నెల రోజుల క్రితం కొన్న 11 ఎకరాల భూమిని చదును చేస్తుంటే లంకె బిందె బయటపడింది. బిందె నిండా కళ్లు మిరుమిట్లు గొలిపేరీతిలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు అవాక్కయ్యాడు. ఇవన్నీ దేవతామూర్తులను అలంకరించే ఆభరణాలుగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో లంకెబిందె బయటపడిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు.
పెంబర్తికి కాకతీయుల నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు దొరికిన బంగారంలో దేవతామూర్తులను అలంకరించే ఆభరణాల్లా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. లంకెబిందె దొరికిన చోట గుడి కట్టించాలని గ్రామ పెద్దలు బావిస్తున్నారు.