Telangana: కొత్త ఉద్యోగాలా..? నిరుద్యోగ భృతా..?

Telangana: తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

Update: 2022-03-09 00:52 GMT

Telangana: ఇవాళ నిరుద్యోగులకో కబురు

Telangana: నాలుగు గంటలు.. నాలుగే నాలుగు గంటలు. అవును ఉదయం 10 గంటలకు ఇంకా నాలుగు గంటల సమయం మాత్రమే. విషయానికొస్తే. ఇవాళ అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనలో ప్రకటించారు. అంతేకాదు నిరుద్యోగులందరూ టీవీలను చూడాలంటూ సూచనలు చేశారు. దీంతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..? నిరుద్యోగులకు ఎలాంటి తీపి కబురు అందించబోతున్నారనేది ఇప్పుడు తెలంగాణ యావత్తు ఎదురుచూస్తోంది.

వనపర్తి వేదికగా టీజర్ విడుదల చేసిన కేసీఆర్.. అసెంబ్లీలో ఎలాంటి సినిమా చూపిస్తారనే ఉత్కంఠ విపక్ష సభ్యుల్లో నెలకొంది. అంతేకాదు నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ చేసిన సూచనలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న నిరుద్యోగ భృతిపై ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఇక 7ఏళ్లలో లక్షా 32వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 75వేల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వివిధ శాఖల్లో 45వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇతర సంస్థల్లో 30వేల ఉద్యోగాలను నింపాల్సి ఉంది. ముఖ్యంగా పోలీస్, విద్య, వైద్యారోగ్యాశాఖలోనే ఖాళీలు ఉన్నట్లు సమాచారం. దీంతో విద్యాశాఖలో 9వేల 600, వైద్యశాఖలో 8వేల 347, పోలీస్ శాఖలో 37వేల 820, విద్యుత్ శాఖలో 12వేల 961, సింగరేణిలో 7వేల 485 పోస్టులను సర్కార్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News