Telangana Election: ఎన్నికల వేళ మద్యం పంపిణీపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫోకస్
Telangana Election: ప్రత్యేక బృందాలను, స్పెషల్ టీంలను రంగంలోకి దింపిన ఎక్సైజ్ శాఖ
Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం పంపిణీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక బృందాలు, స్పెషల్ టీంలను రంగంలోకి దింపింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నిఘతో పాటు ఎన్నికల నిబంధనలపై దృష్టి సారించింది. కాగా.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు మద్యం డిపోలో తనిఖీల్లు నిర్వహిర్వహించారు అధికారులు. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 18 డిస్టిలరీలను తనిఖీ చేయడానికి 10 బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ కమిషనర్.. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు.. DSPల నేతృత్వంలోని ప్రతి బృందం తెలంగాణ రాష్ట్రంలోని డిస్టిలరీలను తనిఖీలు చేయనుంది. మద్యం ఉత్పత్తి, పంపకాలు, రిజిస్టర్‌ల నిర్వహణను కవరేజీని బృందాలు పర్యవేక్షించనుంది.
హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కార్యకలాపాలు, ఉత్పత్తి, డిస్పాచ్‌ల డిస్టిలరీలను 24x7 CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షించనుంది ఎన్నికల బృందం. ఎన్నికల నిబంధనలు అమలు చేయడం కోసం ప్రతి యూనిట్‌లో CCTV కెమెరాలతో పాటు 24x7 వాచ్ మరియు వార్డ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నది. ఎన్నికలను స్వేచ్ఛగా & నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.