Gone Prakash: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు

Gone Prakash: ఆదిలాబాద్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణ

Update: 2021-12-21 12:15 GMT

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌(ఫైల్-ఫోటో)

Gone Prakash Rao: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరర్‌రెడ్డి నేతృత్వంలో అరాచకాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సారంగపూర్‌ జెడ్పీటీసీ పి.రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ వేశారని, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు పత్రాలు సమర్పించారన్నారు.

ఆర్వోగా ఉన్న జిల్లా కలెక్టర్‌.. నిజా నిజాలు తెలుసుకోకుండా నామినేషన్‌ విత్‌ డ్రాను ఆమోదించారని చెప్పారు గోనె ప్రకాశ్. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ల ప్రక్రియ ఆన్‌లైన్‌ చేయాలని సీఈసీని కోరామన్నారు. టీఆర్‌ఎస్‌ కోట్ల రూపాయలు ఖర్చు చేసి, క్యాంపులు ఏర్పాటు చేయడంపై ఈడీతో దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశామన్నారు గోనె ప్రకాశ్.

Tags:    

Similar News