సంక్షేమ పథకాల అమలుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకుని వక్రీకరించి ప్రసారం చేశారని అన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలనే అర్థం వచ్చేలా మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని తెలిపారు. మేలు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని కోరారు లక్ష్మారెడ్డి. కాగా, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్, జడ్చర్ల మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లక్ష్మారెడ్డి మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరుతానని లక్ష్మారెడ్డి మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి.