Hyderabad: విద్యుత్ చార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ
Hyderabad: హైదరాబాద్ హిల్స్ లోని ఫ్యాప్సీ భవనంలో విచారణ.
Hyderabad: విద్యుత్ చార్జీల పెంపుపై హైదరాబాద్ హిల్స్‌లోని ఫ్యాప్సి భవనంలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించింది. 2022-2023లో 6,831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించింది. బహిరంగ విచారణలో వివిధ వర్గాల వారు పాల్గొన్నారు. పలు వర్గాల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఈఆర్సీ పరిశీలించి చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. విద్యుత్ చార్జీల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.