కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు

హాజరైన ఐదుగురు ఎగ్జిక్యూటివ్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు

Update: 2024-09-24 08:55 GMT

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు

కాళేశ్వరం కమిషన్ ముందు తాజా, మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు. తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు 1600 కోట్ల... బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజనీర్లు అంగీకరించారు. బ్యాంక్ గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి... ఏమైనా తీసుకున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించింది. తిరుపతిరావు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన విషయం... ఉన్నతాధికారుల దృష్టిలో లేదని చెప్పారు ఇంజనీర్లు.

2022 జూలైలో భారీ వరదలు వచ్చాయని... ఆ వరదల కారణంగా సీసీ బ్లాక్ దెబ్బతిన్నట్లు కమిషన్‌కు వివరించారు. డ్యామేజ్ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాశామన్నారు. డిజైన్లు డ్రాయింగ్‌లు ఎవరు ప్రిపేర్ చేశారని ఇంజనీర్లను ప్రశ్నించింది. వ్యాప్కొస్ సంస్థ డిజైన్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిందని... CE CDO అనుమతితో తాము అమలు చేశామని తెలిపారు.

Tags:    

Similar News