TS Zonal System: కొత్త జోనల్‌ ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన..

TS Zonal System: బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు...

Update: 2021-12-15 06:20 GMT

TS Zonal System: కొత్త జోనల్‌ ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన.. 

TS Zonal System: తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దీంతో వీరిని ఏజిల్లాకు కేటాయిస్తే అక్కడే వారు స్థానికులుగా మారనున్నారు. అంతేకాదు... ఉద్యోగ విరమణ వరకు ఆఉద్యోగులు, ఉపాధ్యాయులు అదే జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. జోనల్‌ క్యాడర్‌ అయితే అదే జోనల్‌లో పనిచేయాల్సి ఉన్నందున.., ఏజిల్లాకు వెళ్తానోనని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఆందోళన చెందుతున్నాడు.

సీనియార్టి ప్రాతిపదికన ఉద్యోగుల విభజన ప్రక్రియను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నూతన జిల్లాల ప్రకారం స్థానికత, విద్యాబ్యాసం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోలేదంటున్నారు ఉపాధ్యాయులు. ఇక ఉమ్మడి జిల్లా సీనియార్టీ ఆధారంగా కొత్త జిల్లాకు కేటాయిస్తే.. తమ పిల్లల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని ఉపాధ్యాయులు ఆందోళన పడుతున్నారు.

ఉద్యోగుల బదిలీలకు సర్కార్‌ ఎంతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖలోని పలు డిపార్ట్‌మెంట్లలో ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయుల జాబితాను ఆయా జిల్లాల డీఈవో వెబ్‌సైట్‌లలో ఉంచుతారు. కాగా.. సీనియార్టి అంశంపై ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయాల్సి వస్తే ఆధారాలతో సహా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి కొత్త జోనల్‌ ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల తర్వాతనే ప్రభుత్వం ఖాళీల జాబితాను ప్రకటించనుంది.

Full View


Tags:    

Similar News